Skip to main content

Budget 2024: యూనివర్సిటీలకు వరాలిచ్చేనా?

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌పై విశ్వవిద్యాలయాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే వర్సిటీలకు సరైన నిధులు లేక అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన మొక్కుబడిగా తయారైంది.
Will it be good for universities  Hyderabad Universities   University Development Needs

పరిశోధనలు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. రాష్ట్రం మొత్తం 15 విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌ మహానగరంలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో ఉస్మానియా వర్సిటీకి రూ.457 కోట్లు కేటాయించింది.

చదవండి: Importance to Education : విద్యారంగంలో అధిక ప్రాధాన్య‌త ఇవ్వాలి.. నిధుల‌తో అభివృద్ధి ఇలా..!

అంబేద్కర్‌ వర్సిటీకి రూ.214 కోట్లు కేటాయింపులు జరిపింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి రూ.45.01 కోట్లు, జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు రూ.48 కోట్లు, జవహార్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌కు రూ.26 కోట్లు కేటాయించారు.

మహిళా యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించారు. అయితే నిధుల విడుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండటంతో అభివృద్ధి పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పనులు ముందుకు సాగలేదు. ఈసారి పద్దు కోసం భారీ స్థాయిలో వర్సిటీలు ప్రతిపాదలు సమర్పించాయి.

Published date : 25 Jul 2024 01:06PM

Photo Stories