Skip to main content

Importance to Education : విద్యారంగంలో అధిక ప్రాధాన్య‌త ఇవ్వాలి.. నిధుల‌తో అభివృద్ధి ఇలా..!

Importance and development in education with funds

చిత్తూరు: వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో విద్యారంగానికి అధిక ప్రాధాన్య‌తిచ్చింది. ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్కూళ్ల కంటే మిన్నగా తీర్చిదిద్దింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలో నాడు–నేడు మొదటి విడతలో రూ.150 కోట్లతో 743, 2వ విడతలో రూ.449 కోట్లతో 1210 ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చింది. ఇలాగే, కూటమి ప్రభుత్వం సైతం ప్రాధాన్యతనివ్వాలని, మిగిలిన బడులను నిధులు వెచ్చింది అభివృద్ధి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Budget Issues : బ‌డ్జెట్‌పై ఉద్యోగ‌, ఉపాధ్యాయుల తీవ్ర నిరాశ‌..

జిల్లాలో పలు మండలాల నుంచి మెడికల్‌, ఇంజినీరింగ్‌ చదువులకు యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ, వైద్య కళాశాల, సైనిక్‌ స్కూల్‌, నవోదయ, ట్రిపుల్‌ ఐటీ వంటి విద్యాసంస్థలను నెలకొల్పాలని విద్యావేత్తలు బలంగా కోరుతున్నారు. అలాగే 75 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

Published date : 25 Jul 2024 09:58AM

Photo Stories