Skip to main content

Professor jobs: కాలేజీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ.. వేతనం నెలకు రూ.1.90 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి జూలై 28న నోటిఫికేషన్‌ విడుదల చేశారు.
Professor jobs
కాలేజీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ.. వేతనం నెలకు రూ.1.90 లక్షలు

ఏడాది కాలానికి వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రా మగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్‌ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లోని మెడికల్‌ కాలేజీల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్‌లలో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమిస్తారు.

చదవండి: Success Story : క‌ఠిన పేదరికం.. అన్నం కూడా దొరకని పరిస్థితి.. కానీ నేడు అంద‌రు గ‌ర్వ‌ప‌డేలా.. అమెరికాలో ప్రొఫెసర్‌గా..

నోటిఫికేషన్‌ నాటికి అభ్యర్థి వయసు 69 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆగష్టు 5న సాయంత్రం 5 గంటలకల్లా అవసరమైన డాక్యుమెంట్లతో  dmerecruitment.contract@mail.comకు మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు. ఆగష్టు 9న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రొఫెసర్, అసో సియేట్‌ ప్రొఫెసర్లకు ఆ రోజు ఉదయం 10 గంటలకు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

ఎంపికైన అభ్యర్థులు ఆగష్టు 24వ తేదీ నాటికి వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. లక్షన్నర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1.25 లక్షలుగా ఖరారు చేశారు.

చదవండి: Success Story: గూడెం నుంచి అమెరికాకు... ఈ వ‌రంగ‌ల్ ప్రొఫెస‌ర్ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టీలకు రెమ్యునరేషన్‌తోపాటు అదనంగా నెలకు రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తారు. వీరి ఎంపిక దేశవ్యాప్తంగా వచ్చే అభ్యర్థుల నుంచి ఉంటుంది. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటారు.

Published date : 29 Jul 2023 11:42AM

Photo Stories