Department of Medicine: నర్సింగ్ అడ్మిషన్‌ల గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్‌లో 2022–23 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సుల్లో (మూడేళ్లు) అడ్మిషన్‌లకు గడువును నవంబర్ 30 వరకు వైద్య శాఖ పొడిగించింది.
నర్సింగ్ అడ్మిషన్‌ల గడువు పొడిగింపు
ఈ మేరకు ఇన్‌చార్జ్ డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. నవంబర్ 21 సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ 25 వరకు ఉంటుంది. 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.