మార్కులే అడ్మిషన్లకు ప్రాతిపదిక
Sakshi Education
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన మార్గదర్శకాలకు స్వల్ప సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర (ఉన్నత విద్యాశాఖ) అక్టోబర్ 21న ఉత్తర్వులు విడుదల చేశారు.
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం గతేడాది జీవో 34ను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హత పరీక్షలను కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో నిర్వహించనప్పుడు.. ఆయా బోర్డులు విద్యార్థులకు ఖరారు చేసిన మార్కులనే ప్రాతిపదికగా తీసుకొని సీట్లు కేటాయించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునేవారికి ఆయా అర్హత పరీక్షల్లో కనీస మార్కులు 35 శాతానికి తగ్గించారు.
చదవండి:
Published date : 22 Oct 2021 03:48PM