AP EDCET 2024 Notification: ఏపీ ఎడ్‌సెట్–2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్)–2024 నోటిఫికేషన్ విడుదలైంది. బీఈడీ, బీఈడీ(స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: మొత్తం 150 ప్రశ్నలు మూడు విభాగాల నుంచి ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 18.04.2024.
ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 22.05.2024 నుంచి 25.05.2024 వరకు
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ తేది: 30.05.2024.
ప్రవేశ పరీక్ష తేది: 08.06.2024.
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/
Published date : 23 Apr 2024 05:05PM
Tags
- AP EDCET 2024 Notification
- Andhra Pradesh State Council of Higher Education
- APSCHE
- BED courses
- Entrance Exams
- AP Education Common Entrance Test
- APEdCET 2024 Syllabus
- AP EDCET 2024
- latest notifications
- Education News
- apedcet
- andhrapradesh
- EntranceExam
- admissions
- BEdCourses
- notifications
- sakshieducation latest admissions