పీఎం యువ మెంటార్‌షిప్‌కు ఏయూ విద్యార్థి
Sakshi Education
ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి యువ మెంటార్‌షిప్ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పరిశోధక విద్యార్థి దేవరకొండ ప్రవీణ్‌కుమార్ ఎంపికయ్యారు.
దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల నుంచి 16 వేల మంది దీనికి పోటీ పడగా.. 75 మందిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రవీణ్‌కుమార్ ఒక్కరే దీనిలో స్థానం పొందారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి అభినందించారు. ప్రధాన మంత్రి యువ మెంటార్‌షిప్ కార్యక్రమంలో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని.. ప్రాచుర్యంలోకి రాని పలువురు స్వాతంత్య్ర యోధుల జీవిత గాథలను పుస్తక రూపంలో తీసుకొస్తారు. దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్ ముద్రిస్తుంది. దీనికి సంబంధించిన పరిశోధన, సమాచార సంగ్రహణ చేసేందుకు ఆరు నెలల పాటు నెలకు రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది.
చదవండి:
Published date : 04 Jan 2022 04:02PM