Skip to main content

Acharya K Samatha: ఏయూలో లిక్విడ్‌క్రిస్టల్స్‌పై పరిశోధనలు

ఏయూ క్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో నిర్వహిస్తున్న 30వ జాతీయ లిక్విడ్‌ క్రిస్టల్స్‌ జాతీయ సదస్సును ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత ప్రారంభించారు.
Investigations on Liquid Crystals in Au, AU Rector Acharya K. Samatha inaugurates 30th National Liquid Crystals Conference

న‌వంబ‌ర్ 2న‌ నుంచి మూడు రోజుల పాటు సదస్సు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏయూ భౌతిక శాస్త్ర విభాగం సర్‌ సీవీ రామన్‌న్‌నుంచి స్ఫూర్తిని పొందిందని, తరువాతి కాలంలో ఆయన శిష్యులు ఆచార్య సూరి భగవంతం బలమైన పునాదులు నిర్మించారన్నారు. నేడు భారత్‌ అణుశక్తి, అంతరిక్ష, ఐఓటీ రంగాలలో అద్వితీయ ప్రగతిని సాధిస్తోందన్నారు. ఎల్‌సీడీల ఆవిష్కరణ తదనంతర మార్పులు వివరించారు. మూడు రోజుల సదస్సును పరిశోధకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చదవండి: Physical Education: ‘వ్యాయామ విద్య’కు పెద్దపీట

ఆర్‌ఆర్‌ఐ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ కేఏ సురేష్‌ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఏయూలో లిక్విడ్‌క్రిస్టల్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ రంగంలో పీసీ పతి చేసిన పరిశోధనలు, కృషిని వివరించారు. ఇండియన్‌న్‌లిక్విడ్‌ క్రిస్టల్‌ సొసైటీ అధ్యక్షుడు ఆచార్య రవీంద్ర ధర్‌ మాట్లాడుతూ లిక్విడ్‌ క్రిస్టల్స్‌పై పరిశోధనలు దేశ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న విధానాన్ని వివరించారు.

ఈ సందర్భంగా అందించే పలు అవార్డులను ప్రకటించారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య ఎస్‌.శ్రీనివాస రావు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డీన్‌ ఆచార్య కె.బసవయ్య, సదస్సు కన్వీనర్‌ ఆచార్య ఎం.రామకృష్ణ నాంచారరావు ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన పరిశోధకులు, ఆచార్యులు పాల్గొన్నారు.

Published date : 04 Nov 2023 09:39AM

Photo Stories