Physical Education: ‘వ్యాయామ విద్య’కు పెద్దపీట
ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు క్రీడా సామగ్రి సరఫరా చేసి క్రీడలను ప్రోత్సహిస్తోంది. గతంలో క్రీడా పరికరాల కోసం తూతూ మంత్రంగా ఏటా రూ. 500 నుంచి రూ.1000 దాకా మంజూరు చేసేవారు. ఇప్పుడు వేలాది రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన క్రీడా సామగ్రిని సరఫరా చేసింది.
చదవండి: National Games 2023: జాతీయ క్రీడల్లో వ్రితి అగర్వాల్‌కు మరో పతకం
సరఫరా చేస్తున్న క్రీడా పరికరాలివే..
ప్రాథమిక పాఠశాలలకు...
ఉడెన్ క్రికెట్ బ్యాట్, వికెట్స్ సెట్, టెన్నిస్ బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ప్రిస్బీ, మల్టీ కలర్ హులా హూప్స్, స్టెప్ హార్డిల్స్, స్కిప్పింగ్ రోప్
ప్రాథమికోన్నత పాఠశాలలకు..
వాలీబాల్, త్రోబాల్స్, టన్నీకాయిట్, బాస్కెట్ బాల్, టెన్నికాయిట్ రింగ్, టెన్నికాయిట్ నెట్, స్కిప్పింగ్ రోప్స్, చెస్ సెట్, వేయింగ్ మిషన్, షాట్‌ఫుట్, డిస్కస్ రబ్బర్, కోన్స్‌మార్క్‌లగ్, స్టెప్ హార్డీస్, ప్రిస్బీ
ఉన్నత పాఠశాలలకు...
వాలీబాల్స్, వాలీ నెట్, త్రోబాల్స్, త్రోబాల్ నెట్, హ్యాండ్‌బాల్స్, టెన్నికాయిట్స్, టెన్నికాయిట్ నెట్, స్కిప్పింగ్ రోప్స్, యోగా మ్యాట్స్, చెస్‌సెట్, ఫుట్ ఎయిర్ పంప్, ఫుట్‌బాల్, వేయింగ్ మిషన్, షాట్‌ఫుట్, డిస్కస్ త్రో, మెజరింగ్ టేప్, యోగా మ్యాప్, ఫుట్ పంప్.
పరికరాల కోసం రూ. కోటికిపైగా ఖర్చు
ప్రాథమిక పాఠశాలలకు సరఫరా చేసే క్రీడా పరిరకాల కోసం ఒక్కో పాఠశాలకు రూ. 3,400, ఒక్కో ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.7,800, ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ. 17,700 ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1179 ప్రాథమిక పాఠశాలలు, 195 ప్రాథమికోన్నత పాఠశాలలు, 346 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి రూ. 116 లక్షలా 63 వేల 800 ఖర్చు చేశారు.
తొలిసారి పీడీ, పీఈటీలకు సమావేశాలు
విద్యా వ్యవస్థలో తొలిసారి పీడీ, పీఈటీలకు స్కూల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కేవలం సబ్జెక్టు టీచర్లకు మాత్రమే కాంప్లెక్స్‌లు ఉండేవి. ఈసారి పీడీ , పీఈటీలకు కూడా కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రంగా ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో గత నెలలో పీడీ, పీఈటీలకు కూడా కాంప్లెక్స్ సమావేశాలు జరిగాయి. వ్యాయామ విద్యకు పెద్దపీట వేసి తమకు శిక్షణ ఇవ్వడం శుభసూచికమని పీడీలు, పీఈటీలు చెబుతున్నారు.