Prof PVGD Prasad Reddy: సాంకేతిక ప్రగతితో అవకాశాలు
సెప్టెంబర్ 15న ఇంజినీర్స్ డే ని పురస్కరించుకుని సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన యాక్సిస్ 2కే 23 సింపోజియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అవకాశాల తలుపులు తెరుచుకుంటున్నాయని, వీటిని అందుకోవాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉందన్నారు. సాంకేతికత రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న విధానం వివరించారు. సమాజ సమస్యలకు పరిష్కారాలను చూపేది ఇంజనీర్లేనని,నేటి సమాజంలో ప్రతి అంశం ఇంజనీరింగ్ తో ముడిపడి ఉందనే వాస్తవాన్ని మనందరం గమనించాలని సూచించారు.
చదవండి: India Position In AI Technology: ఏఐ ప్రపంచంలో మన స్థానమెక్కడ?
భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా నేటి తరం పనిచేయాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక, సన్నద్ధత చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి కుమార్ రాజా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.కుమార్ రాజా , ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. శశిభూషణరావు కన్వీనర్ ఆచార్య సి.ఎన్‌వి. సత్యనారాయణరెడ్డి, స్టూడెంట్ కోఆర్డినేటర్ పి. సాత్విక,డాక్టర్ కె.రాజశేఖర్, ఆచార్య ఎస్.కె యజ్దాని తదితరులు ప్రసంగించారు.
చదవండి: Technology in Startup's: స్టార్టప్‌ల ప్రోత్సాహం, వాటి సమస్య పరిష్కారాలపై అవగాహన