Technology in Startup's: స్టార్టప్‌ల ప్రోత్సాహం, వాటి సమస్య పరిష్కారాలపై అవగాహన
సాక్షి ఎడ్యుకేషన్: స్టార్టప్ సంస్థల నిర్వహణలో యువమేధస్సు ప్రతిభ చూపడంతోపాటు వాటి నిర్వణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై సాంకేతికతను వినియోగించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి సూచించారు. స్థానిక జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) వర్సిటీలో ‘వ్యవస్థాగత, నాయకత్వ అభివృద్ధి’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో పాటు వాటి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై సమాంతరంగా అవగాహన కల్పించాలని సూచించారు.
Universal Public Exam: సార్వత్రిక పరీక్షల కోసం ఫీజు..
ఔత్సాహికులైన విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలనుకునే వారు ముందుగా ఈఎల్‌డీపీలో నమోదు చేసుకోవాలని చెప్పారు. నమోదైన విద్యార్థులందరినీ 100 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా విడదీసి ఈ బ్యాచ్‌లను మళ్లీ గ్రూపులుగా విడదీసి, ప్రతి గ్రూప్‌లో 4 నుంచి 5 మంది విద్యార్ధులు సభ్యులుగా ఉండే విధంగా తయారు చేసి ఐఐటీ పాట్నా, ఐఐఎం కోల్‌కత్తా నుంచి నిష్టాతులైన నిపుణులు గ్రూపులకు మెంటర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్ జి.జయసుమ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శ్రీకుమార్, అధ్యాపక సిబ్బందితోపాటు విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి