Universal Public Exam: సార్వత్రిక పరీక్షల కోసం ఫీజు..
Sakshi Education
సార్వత్రిక విద్యాపీఠం పబ్లిక్ పరీక్షల కోసం డీఈవో సంస్థ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన తేదీని ప్రకటించింది. ఇవి వచ్చే ఏడాది జరిగే పరీక్షలు. ఈ పరీక్షలకు హాజరు అయ్యే వారంతా కింద ఇచ్చిన వివరాలను పరిశీలించి, తగిన ఫీజును చల్లించాల్సి ఉంటుంది.
సాక్షి ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది(2024)లో జరిగే సార్వత్రిక విద్యాపీఠం టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకాగోరు విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ ఏడాది అక్టోబర్ 15 లోపు చెల్లించాలని డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
School Fees: పాఠశాలల్లో ఫీజుల వివరాలు విద్యాశాఖకు చేరాల్సిందే
పదో తరగతి విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చొప్పున చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు www. apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాల్సిందిగా కోరారు.
Published date : 12 Sep 2023 01:23PM