School Fees: పాఠశాలల్లో ఫీజుల వివరాలు విద్యాశాఖకు చేరాల్సిందే
సాక్షి ఎడ్యుకేషన్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇక నుంచి ఏ పాఠశాలలో ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో చెప్పాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో జిల్లాలోని పాఠశాలల్లో తరగతుల వారీగా ఫీజుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల వివరాలు పాఠశాల విద్యాశాఖకు చెందిన ఐఎస్‌ఎంఎస్ పోర్టల్‌లో పొందుపరిచేందుకు సిద్ధమవుతోంది. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సైతం రూపొందించారు.
School Attendance Concept: బయోమెట్రిక్ అటెండెన్స్ ఇకపై బడుల్లో కూడా
చట్టం ఏం చెబుతోంది..
● పాఠశాలస్థాయిలో ఫీజు నియంత్రణ చట్టం ఉన్నప్పటికీ ఏళ్లకాలంగా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు దోచుకుంటున్నాయి.
● ఉమ్మడి జిల్లా పరిధిలోని 1100కు పైగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 3లక్షలకు పైగా మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు కాకపోవడంతో పాఠశాలల నిర్వాహకులు సూచించిన విధంగానే ఫీజులు కడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ జేబులను గుల్ల చేసుకుంటున్నారు.
● పాఠశాలల నిర్వాహకులు బోర్డులపై రకరకాల తోక, ముద్దు పేర్లతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ దండుకుంటున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా వీటివైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడం పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది.
● ట్రస్టు పేరుతో పాఠశాల ఏర్పాటు చేస్తేనే ఆ విద్యాసంస్థకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. అలా ఏర్పాటైన పాఠశాలకు తప్పనిసరిగా గవర్నింగ్‌బాడీని ఏర్పాటు చేయాలి. ట్రస్టు చైర్మన్, కరస్పాండెంట్, హెచ్‌ఎం, టీచర్, పేరెంట్‌తో గవర్నింగ్ బాడీని నియమించి, ఏయే తరగతులకు ఎంత ఫీజు తీసుకోవాలి..? అర్హత మేరకు ఉపాధ్యాయులకు జీతం ఎంత చెల్లించాలనే నిర్ణయం తీసుకోవాలి.
● అయితే ఎక్కడా ఆది అమలవుతున్న దాఖలాలు లేవు. ఒక్క కరీంనగర్ సిటీలోనే ప్రైవేట్, కార్పొరేట్ కలిపి దాదాపు 200 వరకు పాఠశాలలు న్నాయి. కొన్ని పాఠశాలల్లో పేపర్‌పై మాత్రమే గవర్నింగ్ బాడీని చూపించి, మిగిలిన అన్ని పనులను యాజమాన్యమే చక్కదిద్దుకుంటోంది.
● ప్రతీ పాఠశాలలో తరగతి వారీగా ఫీజు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఉపాధ్యాయుల అర్హత వివరాలను ఇందులో పొందుపరచాలి. అయితే చాలా పాఠశాలల్లో ఫీజు పట్టికను ఏర్పాటు చేయడం లేదు. ఫీజు నియంత్రణ బాధ్యత అధికారులందేనన్న భావన తల్లిదండ్రుల్లో నెలకొంది.
UTF Work Shop: శిక్షణ నిర్వాహణ తో బోధన సమయం వృధా
ప్రైవేట్‌లో పట్టని జీవోలు
● 1994లో జారీ చేసిన జీఓ నంబరు–1లో ప్రైవేటు పాఠశాలలో రుసుం నిర్ణయించడానికి పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్, తల్లిదండ్రుల్లో ఇద్దరితో ఓ కమిటీని నియమించాలని సూచించారు. పాఠశాల వసూలు చేసే రుసుంలో 5శాతం యా జమాన్యం ఆదాయం కింద, 15శాతం పాఠశాల నిర్వహణ, 15శాతం పాఠశాల అభివృద్ధికి ,15 శాతం ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రయోజనా లకు, 50 శాతం వేతనాలకు వినియోగించాలని పేర్కొన్నారు. ఏటా పాఠశాలలో వసూలైన రు సుం మొత్తం, ఖర్చుల అడిట్ రిపోర్టులను జిల్లా విద్యాశాఖాధికారికి యాజమాన్యాలు సమర్పించాలి. ఇవేమి జిల్లాలో అమలు కావడం లేదు.
● 2008లో జారీ చేసిన జీవో నంబరు 90,91,92 ద్వారా రుసుం నిర్ణయించేందుకు డీఈఓ, జిల్లా అడిట్ అధికారి, స్వచ్ఛంద సంస్థ లేదా పేరెంట్స్ కమిటీ ప్రతినిధితో కూడిన రుసుంల రెగ్యులటరీ కమిటీని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించాలని సూచించారు. ఈ కమిటీ పాఠశాలలను పరిశీలించి మౌలిక సదుపాయాలు, పరిస్థితులను చూసి ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తుంది. దీని అమలుపై అధికారుల పర్యవేక్షణ లేదు. పాఠశాలల్లో అమలు కంటితుడుపు చర్యగానే నెలకొంది.
● జీవో 42 ప్రకారం ఉన్నత పాఠశాలకు పట్టణ ప్రాంతాల్లో రూ.11,800, గ్రామీణ ప్రాంతాల్లో 10,800, ప్రాథమిక పాఠశాలలకు పట్టణ ప్రాంతాల్లో రూ. 10,000, గ్రామీణ ప్రాంతాల్లో 9,000 వరకు వసూలు చేయాలని సూచించారు. పై నిబంధనలు ఎక్కడ ఆమలు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Students Education: గ్రామ విద్యార్థులకు ఎస్ఐ శివకుమార్ ప్రోత్సాహం
ప్రయివేటు పాఠశాలల్లో ఫీజు వసూళ్లపై ప్రభుత్వం దృష్టి
ఏయే తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో..
సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశం
సమాయత్తం అవుతున్న జిల్లా అధికారులు
చట్టాన్ని అమలు చేయాలి
ఫీజు నియంత్రణ చట్టం ఉందన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదు. రాజకీయ , ధన బలంతో చట్టాన్ని అమలు చేయడం లేదు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని పోరాడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న పాలకుల వైఫల్యం వల్లే విద్యావ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది.
– కసిరెడ్డి మణికంఠరెడ్డి,
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు