Students Talent : విద్యార్థుల సృజనాత్మకతకు శిక్షా సప్తాహ్..
తవణంపల్లె: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికే శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునున్నట్లు డీఈఓ దేవరాజలు తెలిపారు. గురువారం మండలంలోని అరగొండ బాలుర, బాలికల హైస్కూల్, అపోలో ఈషా పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. అరగొండ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పలు పాఠ్యాంశాలపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు.
Draupadi Murmu: టీచరమ్మగా రాష్ట్రపతి
శిక్షా సప్తాహ్‌లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. తర్వాత అరగొండ సమీపంలోని అపోలో ఈషా పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి యుడైస్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓలు హేమలత, త్యాగరాజులరెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.