Sakshi Education విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ఆవిష్కర్తలుగా మార్చే ప్రతిభాన్వేషణ పోటీలకు కేంద్ర సంస్థలు శ్రీకారం చుట్టాయి. చిత్తూరు: కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ), విజ్ఞాన్ ప్రసార్ (కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం), విజ్ఞాన భారతి (స్వదేశీ శాస్త్ర, సాంకేతిక ఉద్యమం) సంయుక్త నిర్వహణలో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’కు దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెప్పారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులు కింది స్థాయి అధికారులకు ఆదేశించారు. Direct Interview Jobs: రేపు కేర్ టేకర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. వీళ్లు అర్హులు విద్యార్థులను ప్రోత్సహించాలి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రతిభాన్వేషణ పోటీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆదేశించాం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయి. – దేవరాజు, డీఈఓ, చిత్తూరు ప్రాంతీయ భాషల్లో పరీక్ష ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు కలిసొచ్చే అంశం. గణితం, సామాన్యశాస్త్రం పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం అంశాలు, విజ్ఞానశాస్త్రంలో భారతదేశం కృషిపై 20 శాతం, లాజిక్ రీజినింగ్లో 10 శాతం, శాస్త్రవేత్తల జీవిత చరిత్రకు 20 శాతం బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్టాప్ల ద్వారా పరీక్షలో పాల్గొనవచ్చు. ఇంగ్లిష్, హిందీ, ఇతర తొమ్మిది ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. Collector Kumar Deepak: ‘గొడుగుల పాఠశాల’ పై కలెక్టర్ సీరియస్ నమోదు ఇలా.. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రతిభాన్వేషణ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు www.vvm.org.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) పోటీ పరీక్ష పాఠశాల, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తారు. ఎవరు అర్హులంటే..! జిల్లాలో 6వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ఆన్లైన్ విధానంలో ఓపెన్ బుక్ పద్ధతిలో విద్యార్థులు ఇంటి నుంచే ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనవచ్చు. UTF on Education : విద్యా రంగంలో ఉన్న సమస్యలపై యూటీఎఫ్ ఆందోళన.. Published date : 26 Jul 2024 12:05PM Tags School Students Vidyarthi Vigyan Manthan talent competition Applications sixth to inter intermediate 1st year students open book manner talent test online applications students competitions students talents Regional Language Education News Sakshi Education News