UTF on Education : విద్యా రంగంలో ఉన్న సమస్యలపై యూటీఎఫ్ ఆందోళన..
![UTF rises voice on problems faced in education sector Vasundhara Devi receiving petition from UTF leadersUTF leaders calling for action on education sector issues](/sites/default/files/images/2024/07/26/utf-vasundaradevi-education-sector-1721974781.jpg)
పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల విశ్వాసం సడలిపోతోందని యూటీఎఫ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కాకముందే చంద్రబాబు సర్కార్ మేల్కోని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏఓ వసుంధరాదేవిని గురువారం కలసి వినతిపత్రం అందజేశారు.
Direct Interview Jobs: రేపు కేర్ టేకర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. వీళ్లు అర్హులు
ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. జీఓ నంబర్ 117ను రద్దు చేయాలని, ప్రీప్రైమరీతో పాటు 1 నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులను ఒకే పాఠశాలలో ఉంచాలని, ఒకే సిలబస్.. ఒకే పరీక్షా విధానం ఉండాలని, హైస్కూల్స్‌లో ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలను సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఒక కిలోమీటర్, అంతకు పైగా దూరం నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.
Collector Kumar Deepak: ‘గొడుగుల పాఠశాల’ పై కలెక్టర్ సీరియస్
మున్సిపల్ యాజమాన్య పరిధిలోని ఉపాధ్యాయుల పీఎఫ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫ్లస్ 2 స్కూళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు భూతన్న, కోశాధికారి శ్రీనివాసులు, కార్యదర్శులు తాహిర్‌వలి, శివశంకర్, లక్ష్మీనారాయణ, నరేష్, మాలింగప్ప తదితరులు పాల్గొన్నారు.
CLAT 2025 Notification : క్లాట్–2025 నోటిఫికేషన్ విడుదల.. 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు!
Tags
- Education Sector
- UTF
- Demand
- school problems
- pre primary
- Schools
- students education
- new govt
- AP CM Chandra Babu
- AO Vasundara Devi
- Telugu and English Medium
- Education News
- Sakshi Education News
- UTF Leaders Concern
- State Government Attitude
- Government Schools Confidence
- Chandrababu Sarkar Education
- Collectorate AO Vasundhara Devi
- Education Sector Issues
- Puttaparthi Urban news
- Education Petition