TET Updates: టెట్ పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి ఎడ్యుకేషన్: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) కోసం విద్యా శాఖాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ పరీక్షకు 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఈవో ప్రణీత తెలిపారు. మొత్తం 10,840 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పేపర్–1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈపరీక్షకు 7,716 మంది హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సా యంత్రం 5 గంటల వరకు నిర్వహించే పేపర్–2 పరీక్షను 3,124 మంది రాయనున్నారు.
TET Exam: TETపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో తెలిపారు. అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావాలని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌పై ఫొటో ఐడేంటిఫికేషనన్ లేనట్లయితే ఫొటో అతికించి గెజిటెడ్ సంతకం చేయించి పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఉదయం నిర్వహించే పరీక్షకు 33 కేంద్రాలు, మధ్యాహ్నం పరీక్షకు 14 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.