School Attendance Concept: బయోమెట్రిక్ అటెండెన్స్ ఇకపై బడుల్లో కూడా
![Facial recognition attendance facility for school students, Biometric attendance system in school](/sites/default/files/images/2023/09/12/school-attendance-1694497468.jpeg)
సాక్షి ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో ఇక నుంచి విద్యార్థులకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ)ను అమలు చేయనున్నారు. స్కూళ్లలో బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ కొనసాగుతుండగా, కరోనా తర్వాత ఈ ప్రక్రియ అమలు కావడం లేదు. ఈ క్రమంలో ఆయా పాఠశాలల్లో పథకాల అమలులో కచ్చితత్వం, అవకతవకలకు చెక్ పెట్టేందుకు గాను ఈ ఫేషియల్ యాప్‌ను రూపొందించారు. సోమవారం నుంచి జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. విద్యార్థి ముఖంలోని కనురెప్పలు, పెదాలు, ముక్కు, తదితర అవయవాలను స్కాన్ చేస్తారు.
బయోమెట్రిక్ హాజరు సమయం ఎక్కువ తీసుకుంటుండగా, ఈ యాప్ ద్వారా సత్వరం పూర్తవుతుంది. ఉపాధ్యాయుల వద్ద ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్స్, ట్యాబ్‌ల ద్వారా విద్యార్థుల ముఖాలను స్కాన్‌చేస్తే హాజరు నమోదవుతుంది. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు క్షణాల్లో ఈ వివరాలన్నీ చేరుతాయి. ఎంత మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. హాజరు శాతం తదితర వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి.
Success Story: ఈ జంట సాధించిన విజయంతో వారి ఇంట వేడుకలు రెట్టింపు...
జిల్లాలో నేటి నుంచి..
పాఠశాల విద్యాశాఖ ఇదివరకు పైలెట్ ప్రాజెక్ట్‌గా రెండు జిల్లాల్లో ఈ యాప్ ద్వారా విద్యార్థుల హాజ రుకు శ్రీకారం చుట్టింది. అక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి అమలుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే విద్యాశాఖాధికా రులు సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఈ విధానం ద్వారా హాజరు తీసుకోనున్నారు. నెట్వర్క్ లేని పాఠశాలల్లో ఆఫ్‌లైన్ విధానంలో హాజరు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
యాప్ పనితీరు ఇలా..
గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘డీఎస్‌ఈ–ఎఫ్‌ఆర్‌ఎస్’ పేరిట ఉన్న ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. విద్యార్థుల రిజిస్ట్రేషన్, హాజరు, డిటేల్ రిపోర్టు అనే ఆప్షన్లు ఉంటాయి. ఓ తరగతి గదిలో ఉన్న వి ద్యార్థుల వివరాలన్నీ యాప్‌లో నమోదవుతాయి. ఒక్కో విద్యార్థి పేరు క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. విద్యార్థి ముఖం రౌండ్ సర్కిల్‌లో ఉండేలా చూడడంతో పాటు ముఖం చుట్టూ ఎరుపు నుంచి ఆకుపచ్చ రంగువస్తే హాజరు నమోదవుతుంది.
అవకతవకలకు చెక్..
పాఠశాలల్లో ఇదివరకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తుండగా, కరోనా తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉపాధ్యాయులకు మాత్రమే బయోమెట్రిక్ హాజరు ఉన్నప్పటికీ కొంతమంది టీచర్లు ఉపయోగించడం లేదు. మరమ్మతుల పేరిట ఈ యంత్రాలను మూలన పడేశారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరు ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు ఫేస్ యాప్‌ను ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.
దీనిద్వారా ప్రతిరోజు ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారనే విషయం తెలుస్తోంది. అలాగే మధ్యాహ్నం ఎంత మందికి భోజనం పెట్టారనే వివరాలు తెలిసిపోనున్నాయి. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో విద్యార్థులు పాఠశాలకు హాజరు కాకపోయినప్పటికీ కొంత మంది ఉపాధ్యాయులు హాజరు పట్టికలో హాజరు వేస్తున్నారు. ఇలా బిల్లులు అదనంగా కాజేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అయితే ఈ యాప్ ద్వారా ఇలాంటి అవకతవకలకు చెక్ పడనుంది.
బోగస్ సంఖ్యను ఇట్టే గుర్తించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు లేనప్పటికీ కొంత మంది ఉపాధ్యాయులు పోస్టులను కాపాడేందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్, స్కాలర్‌షిప్ వంటివి ఎంత మందికి అందించారనే విషయం కూడా ఇట్టే తెలిసిపోనుంది. అలాగే ఉపాధ్యాయులకు సై తం త్వరలో ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేపట్టనున్నారు. తద్వారా డుమ్మా పంతుళ్లకు చెక్ పడనుంది.
నేటి నుంచి అమలు..
ఫేషియల్ యాప్ ద్వారా విద్యార్థుల హాజరును సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నాం. ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థుల ముఖాలను ఈ యాప్ ద్వారా స్కాన్ చేయడంతో వారి హాజరు ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. యాప్ వినియోగంపై ఉపాధ్యాయులకు ఇప్పటికే వివరించాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించాలి.
– నారాయణ
UTF Work Shop: శిక్షణ నిర్వాహణ తో బోధన సమయం వృధా