Skip to main content

Success Story: ఈ జంట సాధించిన విజ‌యంతో వారి ఇంట వేడుక‌లు రెట్టింపు...

ప‌లు ప్ర‌య‌త్నాల త‌రువాత సివిల్స్‌లో ఘ‌న‌త సాధించిన ఈ యువ జంట‌ను అంద‌రూ అభినందిస్తున్నారు. ఇద్ద‌రూ ఒకేసారి విజ‌యవంతుల‌వ్వ‌డంతో వీరి ఇంట ఆనందం డ‌బుల్ గా మారింది. ఈ జంట విజ‌యం గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం...
young couple achieved UPSC rank, civil services
young couple achieved UPSC rank

సాక్షి ఎడ్యుకేష‌న్: యూపీఎస్సీ(UPSC) నిన్న విడుదల చేసిన సివిల్‌ సర్వీసెస్‌ 2022 తుది ఫలితాల్లో(CSE 2022 final Result) కేరళకు చెందిన జంట అరుదైన ఘనత సాధించింది. భార్యా భర్తలిద్దరూ సివిల్స్‌లో ర్యాంకులు సాధించి అదరగొట్టారు.  దంపతులిద్దరికీ ర్యాంకులు రావడంతో ఆ ఇంట రెట్టింపు ఆనందం వెల్లివిరిసింది.  

వివరాల్లోకి వెళ్తే..

సివిల్‌ సర్వీసెస్‌కు యూపీఎస్సీ ఎంపిక చేసిన 933 మందిలో కేరళకు చెందిన మాళవిక జి నాయర్‌, డా ఎం.నందగోపన్‌ సత్తా చాటారు. 28 ఏళ్ల మాళవికకు 172వ ర్యాంకు రాగా.. ఆమె భర్త నందగోపన్‌(30)కు 233వ ర్యాంకుతో మెరిశారు.  వీరిద్దరికీ 2020లోనే వివాహం జరిగింది.

మాళవిక ఈ ఏడాది ఐదో ప్రయత్నంలో 172వ ర్యాంకును సాధించగా.. ఆమె  భర్త ఆరో ప్రయత్నం (చివరి)లో విజేతగా నిలిచారు. బిట్స్‌-గోవాలో విద్యనభ్యసించిన మాళవిక 2020లోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మంగళూరులో ఆదాయ పన్ను సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి కేరళ ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌లో డీజీఎంగా పనిచేసి రిటైర్‌ కాగా.. తల్లి గైనకాలజిస్ట్‌.  ఇకపోతే, నందగోపన్‌ తల్లి కొజెంచేరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్‌ వైద్యురాలు కాగా.. తండ్రి IOBలో  చీఫ్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు.

నందగోపన్‌ ప్రస్తుతం పథనంథిట్ట జిల్లాలో మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌లో పనిచేస్తున్నారు. నందగోపన్‌ మలయాళం లిటరేచర్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోగా.. మాళవిక మాత్రం సోషియాలజీని ఎంచుకున్నారు.

Young IAS Success Story: తోలి ప్ర‌య‌త్నంలోనే ఐఏఎస్ కు ఎంపికైన 22ఏళ్ళ యువ‌కుడు....కార‌ణం?

Published date : 11 Sep 2023 03:19PM

Photo Stories