UTF Work Shop: శిక్షణ నిర్వాహణ తో బోధన సమయం వృధా
సాక్షి ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులను బోధనకే వినియోగించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ విమర్శించారు. ఆదివారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ప్రాంతీయ వర్క్ షాపు జరిగింది. సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నక్కా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల పనిదినాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో బోధనా సమయం వృథా అవుతోందన్నారు.
Teachers Examinations: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు పరీక్షలు
ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయకుండా విద్యారంగ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఉపాధ్యాయులపై బనాయించిన కేసులు రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ ఎంవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ దేవేంద్రమ్మ, ఎన్. శాంతి ప్రియ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగమయ్య, గోవిందరాజులు, శ్రీసత్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.జయచంద్రారెడ్డి, ఎం. సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.