Teachers Examinations: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు పరీక్షలు
సాక్షి ఎడ్యుకేషన్: ఈ నెల 15న నిర్వహించనున్న రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మోహన్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 78 పరీక్షల కేంద్రాల్లో 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాక మొదటి సెషన్, మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 58 పరీక్ష కేంద్రాల్లో రెండో సెషన్ ఉంటుందన్నారు. ఇందుకు గాను ఉదయం 18,720 మంది, మధ్యా హ్నం 13,920 మంది అభ్యర్థులు పరీక్ష రాయ నున్నారని, ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
TRT Exam: టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల
పరీక్ష కేంద్రాల పరి ధిలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రథమ చికిత్స అందించాలని, మున్సిపల్ అధికారులు పరిశుభ్రతతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని ఆదేశించారు. పరీక్షల నిమిత్తం 136 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించి.. 13 రూట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అభ్యర్థులను గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్, ఆర్టీఓ నరేష్, ఆర్టీసీ డీఎం సుజాత, ట్రాన్స్‌కో డీఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.