Skip to main content

TRT Exam: టీఆర్టీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్య‌ర్థులంద‌రికీ శుభ‌వార్త‌.. ప్ర‌భుత్వం టీఆర్టీ ప‌రీక్ష‌లకు సంబంధించి నోటీసులు విడుద‌ల చేసింది. అందులో ప‌రీక్ష నిర్వాహ‌ణ తేదీతో పాటు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.
TRT exams notification released for teaching jobs, TRT Exam Details,Exam Dates & Application
TRT exams notification released for teaching jobs

సాక్షి ఎడ్యుకేషన్‌: నిరుద్యోగులు ఎదురుచూస్తున్న టీఆర్టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌)కు ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. చివరిసారి 2018లో టీఎస్‌పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే చేపట్టనుంది. ఇందులో భాగంగా టీఆర్టీ కంటే ముందే టెట్‌ నిర్వహించాలని భావించిన ప్రభుత్వం జూన్‌లో దరఖాస్తులు సైతం స్వీకరించగా.. ఈ నెల 15న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో టీఆర్‌టీ కోసం దరఖాస్తు తేదీ నుంచి కేవలం 60 రోజుల్లో అంటే నవంబర్‌ 20 నుంచి అదే నెల 30వ తేదీ మధ్యలో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు.

First IAS Officer: ఫస్ట్ ఇండియన్‌ ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీకు తెలుసా?

అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 2 వేలకుపైగా పోస్టులు ఖాళీ ఉండగా.. 586 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించడం ఏమిటని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్టు, కేటగిరీల వారీగా చూసినా చాలా తక్కువ ఉంటాయని, అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉన్నారని పేర్కొంటున్నారు. పోస్టులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో టెట్‌కు రెండు పేపర్లు కలిపి దరఖాస్తు చేసుకున్న వారు 80 వేలకుపైగా ఉండటంతో ఒక్కో పోస్టుకు 140– 150 మంది పోటీపడే అవకాశం ఉంది.

ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్‌లో 415 పోస్టులు, నాగర్‌కర్నూల్‌లో 450, నారాయణపేటలో 470, గద్వాల, వనపర్తిలో కలిపి 316 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 30 శాతం పోస్టులు పదోన్నతులకు కేటాయించినా దాదాపు 1,400 పోస్టులు నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వమే తక్కువ పోస్టులు భర్తీ చేస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. చాలామంది గతేడాది నుంచి టీఆర్‌టీ కోసం ఎదురుచూస్తున్నారు. మధ్యలో గురుకుల పోస్టులు పడినప్పటికీ అందులో దాదాపు 80 శాతం కేవలం మహిళలకే కేటాయించడంతో పురుష అభ్యర్థులు ఆశలన్నీ టీఆర్టీ మీదనే పెట్టుకున్నారు.

UPSC Civils Ranker Failure to Success Story : ప‌దో త‌ర‌గ‌తి ఫెయిల్‌.. ఎటుచూసిన అన్నీ అపజయాలే.. కానీ ఈ క‌సితోనే సివిల్స్‌లో ర్యాంక్ కొట్టాడు..

ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎన్ని పోస్టులకు పదోన్నతులు కల్పిస్తున్నారనే అంశంపై ప్రభుత్వానికి స్పష్టత ఉండగా.. మిగిలిన పోస్టులను పెంచాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Published date : 11 Sep 2023 09:19AM

Photo Stories