UPSC Civils Ranker Failure to Success Story : పదో తరగతి ఫెయిల్.. ఎటుచూసిన అన్నీ అపజయాలే.. కానీ ఈ కసితోనే సివిల్స్‌లో ర్యాంక్ కొట్టాడు..
ఈ వైఫల్యలనే.. విజయతీరాలకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషించాలి. దీనికి సరైన ఉదాహరణ.. ఈశ్వర్ గుర్జార్. ఈయన 10వ తరగతిలో ఫెయిల్ అయి.. నేడు అందరు గర్వించేలా..యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఉన్నత ఉద్యోగం సాధించాడు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ గుర్జార్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
ఈశ్వర్ గుర్జర్.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా బడియా నివాసి. అతని తండ్రి సువాలాల్ గుర్జార్. ఈయన ఒక సాధరణ రైతు. తల్లి సుఖీ దేవి. ఈమె గృహిణి. తండ్రి వ్యవసాయం చేస్తూ కొడుకుని చదివించాడు. ఈశ్వర్ గుర్జార్ ఇద్దరు చెల్లెలు. ఒక సోదరి భావన. ఈమెకు పెళ్లి అయింది. మరో చెల్లెలు పూజ. ఈమె 12వ తరగతి చదువుతోంది.
ఎడ్యుకేషన్ :
ఈశ్వర్ గుర్జర్.. 2011లో 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. దీని తర్వాత నేను నా చదువును వదిలివేయాలని నిర్ణయించుకున్నాను. అయితే దీనికే అంత భయపడాల్సిన అవసరం లేదని తండ్రి చెప్పారు. ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత వదులుకోకూడదు. దీని తర్వాత 2012లో 54 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. 12వ తరగతిలో 68 శాతం మార్కులు సాధించాడు.
☛ IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
అలాగే.. ఈశ్వర్ గుర్జార్ అజ్మీర్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ (BA) చేశారు. దీని తర్వాత ఈయనకు 2019 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉద్యోగం వచ్చింది. అతను సమీపంలోని రూప్రా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. దీనితో పాటు.. ఈయన UPSC సివిల్స్‌కు ప్రిపరేషన్ కూడా కొనసాగించాడు.
మూడుసార్లు అపజయాన్ని..
అపజయాల నుంచి విజయ తీరాల వైపుకు వచ్చిన.. ఈశ్వర్ గుర్జార్.. జీవితంలో విజయం సాధించాలనే వారికి మంచి ఉదాహరణ. వెనుక బెంచర్‌గా ఉన్న ఈశ్వర్ గుజ్జర్ 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ అతను జీవితంలో ఎన్నో ఆటంకాలను చవిచూశాడు. ఎన్నో సమస్యలను ఎదుర్కొని చివరికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2022లో ఉత్తీర్ణత సాధించాడు. యూపీఎస్సీ ప్రయాణంలో కూడా మూడుసార్లు అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కానీ వైఫల్యాలు అతని లక్ష్య ఛేదనను విచ్ఛిన్నం చేయలేకపోయ్యాయి.
☛ Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
ఈశ్వర్ గుర్జార్.. తన నాలుగో ప్రయత్నంలో ఎట్టకేలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2022లో ఉత్తీర్ణత సాధించాడు. 2019 సంవత్సరంలో.. ఈతను యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. కానీ 2020 సంవత్సరంలో ఇంటర్వ్యూ వరకు చేరుకుని.. దీనిలో ఉత్తీర్ణత సాధించలేక పోయ్యాడు. ఆ తర్వాత కూడా అతను 2021 సంవత్సరంలో కూడా మరో సారి విఫలమయ్యాడు. మూడుసార్లు విఫలమైనా పట్టు వదలని విక్రమార్కుడులా.. యూపీఎస్సీ 2022లో 644వ ర్యాంక్ కొట్టి చివరి విజయం సాధించాడు.
జీవితంలో ఫెయిల్.. పరీక్షలో ఫెయిల్ అయ్యాము అనే వారికి..
సాధించాలనే లక్ష్యం బలం ఉంటే.. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన సాధించవచ్చని నిరూపించాడు ఈ కుర్రాడు. ఎవరికి సక్సెస్ అనేది అంత సులువుగా రాదు. ఎంతో కష్టపడి చదివితే కానీ ఆ సక్సెస్ అనే తీపి ఫలాలను రుచిచూడలేము. అలాగే జీవితంలో ఫెయిల్.. పరీక్షలో ఫెయిల్ అయ్యాము అని బాధపడే వారికి ఈశ్వర్ గుర్జార్ సక్సెస్ జర్నీ ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు.
☛ Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
☛ Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
☛ Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..
Tags
- UPSC Civils Ranker Success Story
- Ishwar Gurjar UPSC Civils Ranker Success Story
- UPSC Civils Ranker Inspire Success Story
- UPSC Civils Ranker Inspire Success Story
- UPSC Civils Ranker Success Stories in Telugu
- UPSC jobs
- UPSC
- UPSC Civils Ranker Ishwar Gurjar Biography
- Union Public Service Commission
- Union Public Service Commission Civils Rankers Stories in Telugu