Rani Kumudini: తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని
ఆమెను ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీచేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. గత నాలుగేళ్లుగా ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించిన సి.పార్థసారధి పదవీకాలం సెప్టెంబర్ 8వ తేదీ ముగిసింది. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం గత ఫిబ్రవరితో ముగియగా ఏడున్నర నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.
1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి..
ఉమ్మడి ఏపీలో అనేక హోదాల్లో పనిచేసిన దివంగత ఐపీఎస్ అధికారి ఇస్మాల్ పుల్లన్న కుమార్తె రాణీ కుముదిని. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా 2023 దాకా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. తొలుత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జేసీగా, కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగానూ కొంతకాలం ఉన్నారు.
Anurag Garg: ఎన్‌సీబీ డీజీగా నియమితులైన అనురాగ్ గార్గ్
కార్మిక, ఐఎల్‌వో కమిషనర్‌గా, ఉద్యానశాఖ కమిషనర్‌గా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శిగా, ఎన్‌ఎఫ్‌డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో కార్మికశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (స్పెషల్ సీఎస్) పనిచేశారు. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ పొందారు.
విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్..
తెలంగాణ విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోపాల్ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పురపాలక శాఖ, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు.