Anurag Garg: ఎన్‌సీబీ డీజీగా నియమితులైన అనురాగ్ గార్గ్
ప్రస్తుతం ఈయన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో అదనపు డీజీగా పనిచేస్తున్నారు. 2026 మే 23వ తేదీ వరకు లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్‌సీబీ డీజీగా కొనసాగుతారు. ఎన్‌సీబీ దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే బాధ్యత వహిస్తుంది.
ఇతర నియామకులు వీరే..
నాల్కో సీఎండీ: నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్‌ను పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PESB) ఎంపిక చేసింది. ప్రస్తుతం సెయిల్ ఆధ్వర్యంలోని బర్న్‌పూర్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌లకు ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఎస్‌సీఐ సీఈఓ: ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA)లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (CVO) మనోజ్ కుమార్‌కు ఆరు నెలల పాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఎస్‌సీఐ లిమిటెడ్ భారతదేశంలోని ప్రధాన షిప్పింగ్ సంస్థలలో ఒకటి.
Manoj Kumar: కోల్‌కతా కొత్త కమిషనర్‌గా నియమితులైన మనోజ్‌వర్మ