Skip to main content

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు త్వరలోనే కొత్త జడ్జిలు రానున్నారు.
SC Collegium Approves Appointment Of 4 Judicial Officers As Judges Of Telangana High Court

హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జనవరి 11న ఈ సిఫారసు ద్వారా న్యాయాధికారుల కోటా నుంచి నాలుగు పేర్లు సిఫారసు చేసింది.

రేణుక యారా
పుట్టిన తేది: 1973 జూన్ 14
విద్య: 1998లో ఎల్‌ఎల్‌బీ, అమెరికాలో ఎల్‌ఎల్‌ఎం
కెరీర్: 1998లో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు. 2012లో జిల్లా జడ్జిగా నియామకం. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేసి, ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.

నందికొండ నర్సింగ్‌రావు
పుట్టిన తేది: 1969 మే 3
విద్య: 1995లో న్యాయశాస్త్రంలో పట్టా, బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు.
కెరీర్: 2012లో జిల్లా జడ్జిగా నియామకం, విశాఖపట్నం అదనపు జిల్లా జడ్జిగా, తర్వాత వివిధ హైకోర్టు, జ్యుడిషియల్‌, న్యాయశాఖ పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు.

AP High Court: హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు

ఈ తిరుమలాదేవి
పుట్టిన తేది: 1964 జూన్ 2
కెరీర్: న్యాయవాదిగా హైకోర్టు మరియు జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్. 2012లో జిల్లా జడ్జిగా నియామకం, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

బీఆర్ మధుసూదన్‌రావు
పుట్టిన తేది: 1969 మే 25
విద్య: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కాకతీయ యూనివర్సిటీలో.
కెరీర్: 1998-99లో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా. 2012లో జిల్లా జడ్జిగా నియామకం, సీబీఐ కోర్టు ప్రధాన జడ్జిగా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరీగా పనిచేశారు.

ఈ నాలుగు నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత రాష్ట్రపతి ఆమోదం చెయ్యవలసి ఉంది. ఆ తర్వాత ఈ నియామకాలను నోటిఫై చేయనున్నారు.

BCCI Secretary: బీసీసీఐ కార్యదర్శిగా సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్‌

Published date : 17 Jan 2025 08:55AM

Photo Stories