Vinod Chandran: సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ చంద్రన్ ప్రమాణం
Sakshi Education
పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ జనవరి 16వ తేదీ సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం చేశారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు. అత్యున్నత న్యాయస్థానంలో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34.
కాగా, జస్టిస్ చంద్రన్ రాకతో జడ్జీల సంఖ్య 33కు చేరుకుంది. జస్టిస్ చంద్రను సుప్రీంకోర్టు జడ్జీగా నియమించాలంటూ జనవరి 7వ తేదీ కొలీజియం సిఫారసు చేయడం, 13వ తేదీ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది.
2011 నవంబర్ 8వ తేదీ కేరళ హైకోర్టు జడ్జీగా నియమితులైన జస్టిస్ వినోద్ చంద్రన్ 2023 మార్చి 29వ తేదీ పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
Justice Sujay Pal: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్
Published date : 17 Jan 2025 01:10PM