Manoj Kumar: కోల్‌కతా కొత్త కమిషనర్‌గా నియమితులైన మనోజ్‌వర్మ
జూనియర్ డాక్లర్లు డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. వినీత్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది.
జూడాలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ (డీహెచ్‌ఎస్) దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. వారి స్థానాల్లో స్వప్న సొరేన్ (తాత్కాలిక), సుపర్ణ దత్తా(ప్రత్యేక అధికారి)లను నియమించింది.
కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిషేక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్‌కౌంటర్‌లోనూ ముఖ్యభూమిక వహించారు.
ఆర్.జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వారితో చర్చలు నిర్వహించి వారి ప్రధానమైన డిమాండ్లకు అంగీకారం తెలిపింది.