Employment Opportunity: నిరుద్యోగ యువతకు సులభంగా ఉపాధి అవకాశాలు.. ఒక్క క్లిక్‌తోనే ఇలా!

అనంతపురం: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు పెద్దపీట వేసేలా సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. సాంకేతిక వ్యవస్థ సాయంతో జిల్లాలో ఉన్న ఉపాధి కార్యాలయాల స్వరూపమే మారిపోయింది. గతంలో అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్యాలయాలకు రోజుల తరబడి తిరిగి క్యూల్లో నిలబడి విద్యార్హతల వివరాలను నమోదు చేసుకునేవారు. ఇంతా చేసినా, ఒక్కోసారి ఉద్యోగాల సమాచారం అభ్యర్థికి తెలిసేది కాదు. కానీ, నేడు ఒక్క క్లిక్‌తో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఇంటి నుంచే..
నిరుద్యోగ యువత ఎంప్లామెంట్ రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. https://employment.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే లాగిన్ వివరాలు, రిజిస్ట్రేషన్ నెంబర్, సదరు ఫోన్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్ ద్వారా పొందవచ్చు. ఎంప్లాయిమెంట్ కార్డును సైతం లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. దీంతో పాటు ఎంప్లాయిమెంట్ కార్డ్ రెన్యువల్, అదనపు విద్యార్హతల నమోదు వంటి సేవలు సైతం ఆన్‌లైన్ ద్వారా పొందేందుకు అవకాశం ఉంటుంది.
Nirab Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్
సులువుగా ఉద్యోగ సమాచారం
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన నోటిఫికేషన్ల సమగ్ర సమాచారం, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలు ఎంప్లాయిమెంట్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు నేరుగా ఎప్పటికప్పుడు అతి సులువుగా చేరతాయి. విద్యార్హతల ప్రకారం ఉద్యోగాల ఖాళీల వివరాలు యువత ఫోన్ నంబర్, ఈ–మెయిల్‌కు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. వీటితో పాటు జాబ్‌మేళా సమాచారం అందిస్తూ యువతకు, ఇటు సంస్థలకు వారధిగా ఉపాధి కల్పన కార్యాలయం నిలుస్తోంది.
IIT and IIM Counselling: ఈనెల 9న ఫలితాలు.. 10న కౌన్సెలింగ్ ప్రారంభం..!
Tags
- Employment opportunity
- online applications
- easy way job offers
- Unemployed Youth
- Technical system
- Employment Registration
- Private companies
- job opportunities latest
- Education News
- Sakshi Education News
- ananthapur district news
- Anantapuram
- technology
- Employment
- Unemployment
- Youth
- Online Registration
- district jobs
- Modernization
- Accessibility
- SakshiEducationUpdates