UPSC Story of Karthik Kansal : యూపీఎస్సీలో నాలుగు ప్రయత్నాలతో అర్హత సాధించినా ఉద్యోగం దక్కలేదు.. కార్తీక్ కన్సాల్ స్టోరీ ఇదే!
కార్తీక్ కన్సాల్.. ఒక దివ్యాంగుడు. చిన్నప్పటి నుంచి అతనికి మస్కులర్ డిస్ట్రోఫీ (కండరాల బలహీనత) ఉంది. ఈ వ్యాది ఉన్నప్పటికీ ఏం బాధకు గురికాకుండా ధైర్యంగా నిలిచాడు. యూపీఎస్సీ రాసి ఐఏఎస్ అవ్వాలన్నది ఇతని కాల. అందుకు నాలుగు సార్లు ప్రయత్నాలు చేశాడు. ప్రతీసారి ఉన్నత ర్యాంకులతో అర్హత సాధించారు. ఎంపిక కాకపోయినా కూడా మరో ప్రయత్నం చేయాలనుకున్నారు కాని కృంగిపోలేదు. గత సంవత్సరం కూడా యూపీఎస్సీ రాసిన కార్తీక్ ఉత్తమ ర్యాంకు సాధించగా.. ప్రస్తుతం, ఫేక్ డిజెబిలిటీ సర్టిఫికెట్‌తో ఐఏఎస్‌గా ఎంపికై విధులు నిర్వహిస్తున్న పూజా ఖేద్కర్ వివాదం వేళ కార్తీక్‌కు అన్యాయం జరుగుతుందంటూ కార్తీక్ స్టోరీని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సంజీవ్ గుప్తా ట్విటర్‌లో పోస్టు చేశారు.
Budget 2024-25: కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 విడుదల.. ముఖ్యాంశాలు ఇవే..
కార్తీక్ ప్రయత్నాలు..
2019లో ప్రారంభమైన కార్తీక్ ప్రయత్నాలు 2023 వరకు సాగింది. మొదటి ప్రయత్నంగా 2019లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షకు హాజరై 813వ ర్యాంకు సాధించారు. అంతే కాకుండా, అప్పుడు మొత్తం 15 లోకోమోటర్ డిజిబిలిటీ ఖాళీలు ఉండగా అందులో 14 పోస్టులకు భర్తీ చేశారు కార్తీక్. కాని, ఏ ఉద్యోగం దక్కలేదు. తిరిగి, 2021లో రెండో ప్రయత్నం చేసి 271వ ర్యాంకు సాధించారు. అప్పుడూ మళ్లీ 7 లోకోమోటర్ డిజిబిలిటీ ఖాళీలు ఉండగా అందులో 6 పోస్టులకు భర్తీ చేస్తే మళ్లీ అదే ఫలితం. ఇందులో కార్తీక్ తొలి స్థానంలో ఉన్నప్పటికీ తను ఎంపికవ్వలేదు. తిరిగి 2022లో రాయగా 784, 2023లో రాయగా 829వ ర్యాంకులు సాధించారు.
TSRTC 10000 Jobs Details 2024 : ఆర్టీసీలో 10000 ఉద్యోగాలు.. భర్తీ చేస్తాం ఇలా..!
చివరికి..
ఇన్ని ప్రయత్నాలు చేసినా, గమ్యానికి తీరంగా ఉన్నా కూడా అతనిలో ఉన్న లోపం కారణంగా ఎంపికవ్వలేదు. ఇక కార్తీక్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యూనల్‌కు ఆశ్రయించారు. ప్రస్తుతం, ఈ విషయంపై విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే కార్తీక్ ప్రస్తుతం, ఇస్రోలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు.
అసలెందుకు రిజెక్ట్ అయ్యారు..?
కార్తీక్‌కి మస్కులర్ డిస్ట్రోఫీ ఉందని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిర్ధారించింది. అతనికి ఈ వ్యాధి 60 శాతమే ఉందని సర్టిఫికెట్‌లో ఉన్న అది 90 శాతమని పేర్కొంది. కార్తీక్ నిలబడడం తప్పితే అన్ని చేయగలరు. ఇతన మట్లాడడం, తినడం, రాయడం, వినడం, చూడడం వంటివన్ని చేయగలరు. కాని, యూపీఎస్సీ ప్రకారం.. ఈ వ్యాధి ఉన్నవాళ్ల ఐఏఎస్ వృత్తికి అర్హులు. అందుకే.. ఫంక్షనల్, ఫిజికల్ అర్హతలను బట్టి దివ్యాంగులకు సర్వీసులను కేటాయిస్తాం. కాని, కార్తీక్ ర్యాంకు, అర్హతలను బట్టి అతను ఏ సర్వీసుకు సరిపోడు అని నిపుణులు వివరించారు.
DSC Free Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ట్రైనింగ్, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే