High Court: ఆ విద్యార్థులకు 25 శాతం సీట్లివ్వండి
విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధనతో పాటు మిగిలిన నిబంధనలను కూడా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో విద్యా హక్కు అమలుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఇదే అంశంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ ను మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం జనవరి 3న ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆరి్థకంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ యోగేష్ స్వయంగా వాదనలు వినిపించగా, విద్యా శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది కె.రఘువీర్ వాదనలు వినిపించారు.
చదవండి:
Teacher Jobs: బీటెక్, బీఈడీ ఉంటే టీచర్ పోస్టులకు అర్హులే...