Skip to main content

Teachers: టీచర్ల హాజరు, బోధనపై నివేదికలు.. విటి ఆధారంగా టీచర్లు, స్కూళ్లకు గ్రేడింగ్‌ ఇచ్చే యోచన.. గ్రేడింగ్‌ను బట్టి!

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో నిఘా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల హాజ రు, బోధన విధానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
Reports on teachers attendance and teaching news in telugu

ఇందుకోసం మండల విద్యాశా ఖాధి కారులకు అక్టోబర్ 29 నుంచి హైదరా బాద్‌లో శిక్షణ ఇవ్వనుంది. ఇటీవల 602 ఎంఈవో పోస్టులను పదోన్నతుల ద్వారా సీనియర్‌ హెచ్‌ ఎంలతో భర్తీ చేసిన ప్రభుత్వం వారికి సరైన విధివిధానాలు పొందుపర్చలేదు.

కేవలం పర్యవేక్షణ పోస్టులు కావడంతో అవసరమైన పనులు అప్పగించాలని భావిస్తోంది. ముఖ్యంగా ప్రతి స్కూల్లోనూ నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, స్థానిక ప్రజాప్రతి నిధుల సహకారంతో ప్రభుత్వ స్కూళ్ల బలోపేతా నికి కృషి చేయడం ఎంఈవోల బాధ్యతగా ప్రభుత్వం చెప్పబోతోంది. 

లోపాలు ఎక్కడ?

ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో లోపాలపై సీఎం ఇటీవల ఆరా తీశారు. విద్యాశాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించారు. ప్రధా నంగా ప్రభుత్వ పాఠశాలల నిర్వాహణలో టీచర్ల లోపాలను అధికారులు గుర్తించారు.

చదవండి: Parents and Teachers : విద్యార్థుల‌ను ప్రోత్సాహించే ద‌శ‌లో త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీల‌క పాత్ర పోషించాలి

సకాలంలో బోధన చేపట్టకపోవడం, విద్యార్థులను ఆకట్టు కొనే బోధనా పద్ధతులు అనుసరించకపోవ డం ప్రధాన సమస్యగా తేల్చారు. ఇంతకాలం పర్యవే క్షణ లేకపోవడం కూడా టీచర్ల మందకొడితనానికి కారణమని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్నా సరైన బోధనా విధానం లేక మళ్లీ ప్రైవేటు స్కూళ్లకే విద్యార్థులు వెళ్తున్నా రు.

దీన్ని నివారించేందుకు ప్రణాళిక లను రూపొందించారు. ఎంఈవోల నేతృత్వంలో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రతి నెలా హెచ్‌ఎంలు, టీచర్ల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఎంఈవోలకు సూచించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అభ్యసనపై దృష్టి...

ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తర గతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు కూడా కనిపించడం లేదని సర్వేలో గుర్తించిన కేంద్ర విద్యాశాఖ ఆయా బడుల్లో నాణ్యత పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని, ఉన్నత పాఠశా లల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థు లకు ఉన్నతి పేరుతో మరో కార్యక్రమాన్ని అమ లు చేస్తోంది. అయితే వాటి అమలుపై అనేక సందేహాలున్నాయి.

స్కూల్‌ టీచర్లు దీనిపై దృష్టి పెట్టట్లేదని అధికారులు సీఎంకు నివేదించారు. మరోవైపు పదో తరగతి విద్యార్థులకు ఉపాధ్యా యులు ప్రత్యేక తరగతులు నిర్వహించడం మొక్కుబడి వ్యవహారంగా ఉంటోందన్న విమ ర్శలు ఉన్నాయి. దీంతో ఈ అంశంపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని ఎంఈవోలను ప్రభుత్వం ఆదే శించనుంది. టీచర్ల పనితీరుపై ఎంఈవోలు ఎప్పటికప్పుడు నివేదించేలా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ రూపొందించనుంది.

ఆ నివేదికల ఆధా రంగా ఆయా పాఠశాలల పరిస్థితి, ఉపాధ్య యుల పనితీరును అంచనా వేయనున్న ప్రభు త్వం.. వాటి ప్రాతిపదికనే టీచర్లు, స్కూళ్లకు గ్రేడింగ్‌ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది.  

Published date : 29 Oct 2024 11:33AM

Photo Stories