Parents and Teachers : విద్యార్థులను ప్రోత్సాహించే దశలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి
గుంటూరు: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే శాస్త్రీయ పరమైన ఆలోచనలకు పునాది వేయడం ద్వారా భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దవచ్చునని తెలిపారు.
Open School: చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ చక్కని అవకాశం
ప్రతి విద్యార్థి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు తమ మేధస్సుతో పరిష్కారాన్ని చూపించాలని, ఆ దిశగా వారిని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. కళాశాల సలహాదారు డాక్టర్ అబ్బరాజు రాజశేఖర్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలకు నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Private Schools : ప్రైవేటు పాఠశాలలో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలి
ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఏపీఆర్‌ఎస్ (తాడికొండ), జలగం రామారావు జీఎంసీ హైస్కూల్ (గుంటూరు), జెడ్పీ హైస్కూల్ (తాడేపల్లి), ప్రైవేటు పాఠశాలల విభాగంలో కొండవీడు పబ్లిక్ స్కూల్, విజేత పబ్లిక్ స్కూల్, శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ వరుసగా తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో హిందూ ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వజ్రాల నర్సిరెడ్డి, జేవీవీ నాయకులు కె. శ్రీనివాస్, టి.జాన్‌బాబు, ఎస్‌ఎం సుభాని, డాక్టర్ ఏ.ఎస్. ప్రసాద్, బి.ప్రసాద్, జి.వెంకటరావు, టీఆర్ రమేష్, బి.శంకర్‌సింగ్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కళాధర్, కె.సాయి పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)