Open School: చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ చక్కని అవకాశం
విద్యారణ్యపురి: చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ చక్కని అవకాశం కల్పిస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్‌రావు అన్నారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ మార్కజీౖ హెస్కూల్‌లో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ తరగతుల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యూలర్‌గా చదువు కొనసాగించలేకపోయినవారికి, మధ్యలో మానేసిన వారికి టెన్త్, ఇంటర్ చదువుకునేందుకు ఓపెన్ స్కూల్ చక్కని అవకాశం కల్పిస్తోందన్నారు. సెలవుదినాలు, ప్రతి ఆదివారం తప్పనిసరిగా తరగతులకు హాజరుకావాలని సూచించారు. రెగ్యూలర్‌గా చదువుకున్నవారితో సమానంగా ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ కూడా ఉపయోగపడుతుందన్నారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ తరువాత డిగ్రీ, పీజీ ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటున్నవారు కూడా ఉనారన్నారు. ఇదిలా ఉండగా ఈవిద్యాసంవత్సరంలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు ఈనెల 30వరకు గడువు ఉందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అడ్మిషన్లు పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మార్కజీ హైస్కూ ల్ కోఆర్డినేటర్ భూక్య బాలు, కౌన్సిలర్లు కె.వాసువల్సపైడి, కరుణ, ఎడ్ల శ్రీనివాస్, నరసయ్య, కిరణ్‌కుమార్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గొర్రెల కాపరి కుమార్తె... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టిందిలా..