High Court: కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలి
Sakshi Education
జగనన్న విద్యా దీవెన పథకం కింద స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా ఆయా కాలేజీల ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తానిచ్చిన తీర్పును పునః సమీక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పిస్తూ గత ఏడాది జూన్ లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి డిసెంబర్ 13న ఉత్తర్వులిచ్చారు.
చదవండి:
Education: 100% గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం
Published date : 14 Dec 2021 12:11PM