కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నారు.
సీఎం వెఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఇందులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద నవంబర్ 30న రూ.686 కోట్లు చెల్లించనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం నగదు జమ చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక గత చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్ల బకాయిలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.6,259 కోట్లు ఫీజు చెల్లించారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ విద్యా పథకాల కింద 1,97,38,694 మంది విద్యార్థులకు రూ.34,753.17 కోట్ల వ్యయం చేశారు.