Jobs: యూజీసీ ఆదేశాలతో వర్సిటీ పోస్టుల భర్తీ
ఆరు నెలల్లోగా ఈ పోస్టులను భర్తీ చేయాలని సూచిస్తూ షెడ్యూల్‌తో కూడిన సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలను పాటించేందుకు అధ్యాపకుల నియామకం ఎంతో అవసరమని పేర్కొంది. నాణ్యమైన బోధనా ప్రక్రియను కొనసాగించేందుకు వీలుగా వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ కాకపోవడం నాణ్యతా ప్రమాణాలకు ఆటంకంగా మారుతోందని అభిప్రాయపడింది.
డిసెంబర్ 31లోగా పోర్టల్‌లో అప్‌లోడ్..
అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు ఫ్యాకల్టీ పోస్టుల ఖాళీల సమాచారం, రిజర్వేషన్ల అంశాలు, నోటిఫికేషన్ల అడ్వర్టయిజ్‌మెంట్లు, ఇతర వివరాలను డిసెంబర్ 31లోగా https://www.ugc.ac.inలో అప్‌లోడ్ చేయాలని యూజీసీ పేర్కొంది. 2018 యూజీసీ నూతన నిబంధనలను అనుసరించి ఈ నియామకాలు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. కాగా గతంలోనే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని 2019 జూన్ లోనే పేర్కొన్నా ఇప్పటికీ పలు యూనివర్సిటీల్లో ఖాళీలు అలాగే ఉండిపోవడంతో యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ తాజాగా మరోసారి నియామకాలపై ఉత్తర్వులు ఇచ్చారు. 15 రోజుల్లోగా ఖాళీల గుర్తింపు పూర్తి చేయాలని, భర్తీకి అనుమతులను నెల రోజుల్లోగా తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. అనంతరం 15 రోజుల్లో నియామకాలపై యాడ్స్ విడుదల చేయాలని, దరఖాస్తుకు ఒక నెల అవకాశమి వ్వాలని సూచించారు. అడ్వర్టయిజ్ మెంట్ ఇచ్చిన తర్వాత సెలెక్షన్ కమిటీని 15 రోజుల్లో నియమిం చాలి. సెలెక్షన్ కమిటీ సమావేశాలను నిర్వహించి దరఖాస్తుల పరిశీలన నెల రోజుల్లోగా పూర్తి చేయాలి. అనంతరం మరో 30 రోజుల్లో అర్హులైన అభ్యర్ధులకు ఇంటర్వ్యూలను నిర్వహించాలి. ఇంటర్వ్యూలల్లో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వుల కోసం సంబంధిత అధికార విభాగాల నుంచి ఆమోదం పొందాలని పేర్కొన్నారు.
చదవండి:
Job Opportunities: ఇక మీదే ఆలస్యం..కోటికి పైగా ఉద్యోగాలు..!
23,000 Jobs: నియామక ప్రక్రియ ప్రారంభం
Job Opportunities : హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా..3000 ఉద్యోగాలు..