Education: బాలికలు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలి
Sakshi Education
కైలాస్‌నగర్: ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి చదువుతోనే సాధ్యమని, బాలికలు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సూచించారు.

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 24న జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. పిల్లల భద్రత, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు.
చదవండి: B Srinivasa Rao: ఆట పాటలు పాఠ్యాంశాల్లో భాగం
డీఎస్సీ జీవన్‌రెడ్డి ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన క ల్పించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ హసిబుల్లా సైబర్ భద్రత ప్రాముఖ్యత, సురక్షితమైన ఇంటర్నెట్ విని యోగం కోసం ఆచరణాత్మక చిట్కాల గురించి వివరించారు. కార్యక్రమంలో పీపీ రమణారెడ్డి, ఏపీపీ మధుకర్, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, న్యాయవాది అఫ్రోజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 27 Jan 2025 08:54AM