Jai Singh Rathore: కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: నర్సింగ్ విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు.

రిమ్స్‌లోని నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీని యర్స్ ఫిబ్రవరి 5న ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా స్నేహభావంతో మెలగాలని సూ చించారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సూపరింటెండెంట్ రమాదేవి, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 06 Feb 2025 09:01AM