ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా సకల సదుపాయాలు కల్పించి కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం బోధనాభ్యసన ప్రక్రియలు పకడ్బందీగా సాగేందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేస్తోంది.
ప్రభుత్వ స్కూళ్లకు నిధుల వరద
2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎలిమెంటరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు అన్ని తరగతుల విద్యార్ధుల సంఖ్యను అనుసరించి యాన్యువల్ స్కూల్ గ్రాంట్ నిధులను విడుదల చేసింది. పాఠశాలల్లో విద్యార్ధులకు అత్యుత్తమ బోధన అందాలన్న లక్ష్యంతో ఈ నిధులు విడుదల చేసింది. జిల్లాలవారీగా రూ.122.04 కోట్లను మంజూరు చేసింది. వీటిని ఆయా స్కూళ్ల ఖాతాల్లో జమ చేశారు. ఎలిమెంటరీ స్కూళ్లకు రూ.79,87,40,000, సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లకు రూ.42,17,43,000 చొప్పున విడుదలయ్యాయి.