ఇక ఆటలాడుకోవచ్చు!
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా ఆటస్థలాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో తదితర ఆటలు ఆడుకునేందుకు క్రీడా కోర్టులు ఏర్పాటుతో పాటు పిల్లలు, పెద్దల కోసం విశాలమైన రన్నింగ్ ట్రాక్‌లు కూడా సిద్ధం చేయబోతోంది. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధులను ఇందుకు వినియోగించనుంది. గరిష్టంగా రూ.10 లక్షల వ్యయంతో వీటిని అభివృద్ధి చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులు అందుబాటులో ఉండడంతో.. ఆయా జిల్లాల్లో ఈ ఏడాదే అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులిచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ 2 రోజుల కిత్రం శాప్ ఎండీ, వైస్ చైర్మన్లకు లేఖ రాశారు. ఆ నాలుగు జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా క్రీడా కోర్టులు ఏర్పాటు చేసేందుకు గ్రామాల్లో తగిన స్థలాలు గుర్తించాలని కోరారు.
చదవండి:
IIIT: అడ్మిషన్ల పక్రియ ప్రారంభం
Police Department: ప్రభుత్వానికి కొత్త సర్వీస్ రూల్స్‌ను ప్రతిపాదన