Skip to main content

IIIT: అడ్మిషన్ల పక్రియ ప్రారంభం

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో నవంబర్‌ 24న 2021–22 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థులకు అడ్మిషన్ల పక్రియ ప్రారంభించారు.
IIIT
చంద్రికకు ప్రవేశ పత్రాన్ని అందిస్తున్న సతీష్‌చంద్ర

మొదటి ర్యాంక్‌ సాధించిన ఎం.గుణశేఖర్, రెండో ర్యాంక్‌ సాధించిన కె.చక్రధరణిలు మొదటి, రెండో అడ్మిషన్లు పొందారు. వీరి అడ్మిషన్లకు సంబంధించిన ఫైళ్లను డైరెక్టర్‌ సంధ్యారాణి, ఓఎస్డీ వైఎస్‌ గంగిరెడ్డిలు, పరిపాలనాధికారి కొండారెడ్డి, అకడమిక్‌ డీన్ రమేష్ అందజేశారు.


రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీలను అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్ చంద్ర తెలిపారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సర ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నవంబర్‌ 24న ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరిలో నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి 500 నుంచి 600 మంది శాశ్వత బోధన సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి నూతన భవనాలు నిరి్మంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో చాన్సలర్‌ ఆచార్య కేసీరెడ్డి మాట్లాడారు. ఆర్జీయూకేటీ సెట్‌లో మూడో ర్యాంకు సాధించిన మన్నెపూడి చంద్రికకు నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్ ను ఇస్తూ కార్డును సతీ‹Ùచంద్ర అందించారు. అడ్మిషన్ల తొలి రోజు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌కు 400 మందిని పిలవగా 342 మంది హాజరవగా.. వారికి ప్రవేశాలు కల్పించారు. 

చదవండి: 

Intermediate: పరీక్ష ఫీజు గడువు చివరి తేదీ ఇదే..

DGP Mahendar Reddy: నా ఎదుగుదల సర్వేల్‌ గురుకులం భిక్షే

Shivali Srivastava: కాగితపు బొమ్మల తయారీలో శివాలికి 13 గిన్నిస్‌ రికార్డులు

Good News: సివిల్స్‌ కోచింగ్‌ దరఖాస్తు గడువు పెంపు

Published date : 25 Nov 2021 11:47AM

Photo Stories