Admissions News: KU PHD ప్రవేశాలకు బ్రేక్
కేయూ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్ అడ్మిషన్లకు బ్రేక్ పడిం ది. 2021-2022 నోటిఫికేషన్ ద్వారా పీహెచ్ఎ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత అప్పటి నుంచి ఈఏడాది మార్చి 31వ రకు వెకెన్సీలుగా ఉన్న పీహెచ్ డీ సీట్ల భర్తీకి పాత నోటిఫికేషన్లోని మెరిట్ లిస్టు ప్రకారం అధికారులు అడ్మిషన్ల కల ్పనకు ఉపక్రమించబోతున్నారు. ఈ మేరకు ఇటీవలే నిర్వహించిన పాలకమండలి నిర్ణయం మేరకు రిజిస్ట్రార్ ఉత్తర్వులతో విభాగాల వారీగా డీన్లు విభాగాల అధిపతుల నుంచి పీహెచ్ఎల వెకెన్సీల వివరాలు సేకరించారు. భర్తీచేసేందుకు ఉపక్రమిం చబోతున్నారు.
Tomorrow job mela: నిరుద్యోగ యువతకు రేపు జాబ్ మేళా: Click Here
కేయూ రిజిస్ట్రార్ సమావేశం
కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల డీన్లు, విభాగాల అధిపతులు, బీఓఎస్లతో బుధ వారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఓ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారని, కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఎలా ముం దుకెళ్లాలనేది వారితో చర్చించారని తెలిసింది. దీం తో లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
ఇదిలా ఉండ గా గతంలో పీహెచ్ఎ మొదటి కేటగిరీ అడ్మిషన్ల ప్రక్రియ అనంతరం మిగిలిన సీట్లను ఇటీవలే రెం డో కేటగిరీలోకి మార్చారు. అందులో వివిధ విభాగాల్లో 67 సీట్లు ఉన్నట్లు గుర్తించి విభాగాల వారీగా ఆయా విభాగాల్లో 2021-2022 నోటిఫికే షన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ అనంతరం మెరిట్ లిస్టు ప్రకారమే ఆయా అభ్యర్థులకు పీహెచ్ఎ అడ్మి షన్లకు ఇటీవలే ఆర్డర్లు ఇచ్చారు. దీంతో అందులో 48మంది జాయిన్ అయ్యారు. కొందరు ఇంకా జాయిన్ కావాల్సింది. అయితే పీహెచ్డీ రెండో కేటగిరీలో ఈఏడాది మార్చి31 వరకు ఏర్పడిన వెకె న్సీల వివరాలు సేకరించారు. అందులో భర్తీచేయ బోతుండగా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అభ్య ర్థి కోర్టుకు వెళ్లాడు. దీంతో కోర్టు మధ్యంతర ఉత్త ర్వులతో ఇప్పుడు పీహెచ్ రెండో కేటగిరీలోని అడ్మిషన్లకు బ్రేక్ పడింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కాకతీయ విశ్వవిద్యా లయం పీహెచ్ఎ ప్రవేశాలను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచే సింది. పాత నోటిఫికేషన్ మెరిట్ లిస్టుతో కొత్త సీట్లు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించిన ధర్మా సనం.. కొత్తగా పీజీ పాసైన వారు, మళ్లీ పరీక్ష రాయాలనుకుంటున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. నోటిఫికేషన్లో చూపిన సీట్లకు మించి ఒక్క సీటు కూడా ఎక్కువగా నింపడా నికి వీల్లేదని తేల్చిచెప్పింది. పాత నోటిఫికేషన్ ద్వారా కొత్త సీట్లను నింపడానికి కాకతీయ వర్సిటీ ఈ నెల 16న జారీ చేసిన నోటిఫికే షన్ ను సవాల్ చేస్తూ హనుమకొండకు చెందిన చల్లా అమరేందర్రెడ్డి హైకోర్టును ఆశ్రయిం చారు.
ఉత్తర్వులు జారీ
ఈ పిటిషన్పై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. కొత్త సీట్లకు మళ్లీ నోటిఫికే షన్ జారీ చేసి అర్హులందరికీ సమాన అవకాశం కల్పించాలంటూ పిటిషనర్ తరఫున న్యాయ వాది అఖిల్ వాదనలు వినిపించారు. విశ్వ విద్యాలయం తరఫున పి.భానుప్రకాష్, ప్రభు త్వం తరపున ఉన్నత విద్యాశాఖ జీపీ వాదన లు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూ ర్తి.. ఈ నెల 16న రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వు లను నిలుపుదల చేశారు. దాని ఆధారంగా ఎటువంటి ప్రవేశాలు చేపట్టరాదని మధ్యం తర ఉత్తర్వులు జారీ చేశారు.