RGUKT: ఆర్జీయూకేటీలో ముగిసిన రెండోదశ కౌన్సెలింగ్
క్యాంపస్‌లోని అకడమిక్ బ్లాక్‌లో విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరమణ ఆదేశాల మేరకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.
కాగా, 82 మంది సాధారణ, క్యాప్ కేటగిరీలో 14 మంది, గ్లోబల్ కేటగిరీలో ఏడుగురు విద్యార్థులు హాజరయ్యారు. వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన కావ్యశ్రీకి ఎంపిక ధ్రువపత్రాన్ని జాయింట్ కన్వీనర్ డాక్టర్ పావనితో కలసి అందజేశారు. రెండోదశలో మిగిలిన సీట్లను మూడవ విడతలో భర్తీ చేస్తామని తెలిపారు. దానికి సంబంధించిన జాబితాను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
గ్లోబల్ కోటా స్వరాష్ట్రం సీట్లను సైతం భర్తీ చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తేదీలను ఖరారు చేస్తామన్నారు.
వివరాలకు www.rgukt.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో జాయింట్ కన్వీనర్లు రంజిత్‌కుమార్, డాక్టర్ దత్తు, అడ్మిషన్స్ కమిటీ సభ్యులు హరి కృష్ణ, సునీత, డాక్టర్ కుమార్ రాగుల, శ్రీకాంత్, రాకేశ్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.