Triple-IT: ట్రిపుల్ ఐటీ దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల.. ప్రవేశార్హతలు, వయస్సు, అడ్మిషన్లు విదానం ఇలా..
ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను మే 8 నుంచి జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రవేశాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీ–ఏకు 7 %, బీసీ–బీకి 10 %, బీసీ–సీకి 1%, బీసీ–డీకి 7%, బీసీ–ఈకి 4% చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తారు.
ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 5%, సైనికోద్యోగుల పిల్లలకు 2%, ఎన్‌సీసీ విద్యార్థులకు 1%, స్పోర్ట్స్ కోటా కింద 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5% సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలోనూ 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.
చదవండి: Engineering Seats: ఈ సీట్లకు యాజమాన్య కోటా యమ డిమాండ్..
ప్రవేశార్హతలు:
అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలోనే 2024లో ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
31–12–2024 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు నిండకుండా ఉండాలి.
మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇలా..
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ హైస్కూళ్లు, మున్సిపల్ హైసూ్కళ్లలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4% డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు.
దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయిటేజీగా పేర్కొన్నారు. 85% సీట్లను స్థానికం గాను, మిగిలిన 15% సీట్లను మెరిట్ కోటాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.