Skip to main content

RGUKT: ట్రిపుల్‌ఐటీకి కొత్త వీసీ.. ఇన్‌చార్జి వీసీపై ఆరోపణలు..

నిర్మల్‌: బాసర ట్రిపుల్‌ఐటీ (ఆర్జీయూకేటీ) కొత్త ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్‌గా హైదరాబాద్‌ జేఎన్‌టీయూ రెక్టార్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌ను నియమించారు.
TripleITs new VC

ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆదేశాలు జారీచేశారు. రెండేళ్లపాటు ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌) ఇన్‌చార్జి వీసీగా ఉన్న ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌, ప్రొఫెసర్‌ వెంకటరమణను తొలగించారు.

ఆయన స్థానంలో ప్రొఫెసర్‌ గోవర్ధన్‌కు బాధ్యతలు అప్పగించారు. రెండేళ్లలో చెప్పుకోదగ్గ మార్పులు తీసుకురాకపోవడంతో పాటు ఇటీవల వెంకటరమణపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలు ఆరోపణలు సైతం వస్తుండటంతో ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో కొత్తగా ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టనున్న ప్రొఫెసర్‌ గోవర్ధన్‌పైనే వర్సిటీ ఆశలు పెట్టుకుంది.

చదవండి: Teaching Posts : ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీలో టీచింగ్‌ పోస్టులు.. అర్హులు వీరే..

ఇన్‌చార్జి వీసీపై ఆరోపణలు..

2022లో విద్యార్థుల ఆందోళన సమయంలో హామీలు ఇచ్చిన అప్పటి ప్రభుత్వం ఇన్‌చార్జి వీసీగా ఉన్నతవిద్యామండలి వైస్‌చైర్మన్‌ వెంకటరమణను, డైరెక్టర్‌గా ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ సతీశ్‌లను నియమించింది. ఆర్జీయూకేటీని ఏదో చేసేస్తాం.. అన్నట్లుగా బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జి వీసీ వెంకటరమణపై సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

చుట్టపు చూపుగా వర్సిటీకి వస్తున్నారని, విద్యార్థులు చెబుతున్న సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా ఉన్నతాధికారులకూ ఇక్కడి సమస్యలు తెలియనివ్వకుండా చేశారని, వారికి అంతాబాగానే ఉన్నట్లు చూపారన్న విమర్శలు వచ్చాయి. అలాగే ఆందోళన సమయంలో పాల్గొన్న విద్యార్థులపైన కేసులు పెట్టించి, భయాందోళనకు గురిచేశారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

వర్సిటీ వరకే కాకుండా హైదరాబాద్‌లోనూ ఆయనపై పలురకాల ఆరోపణలు వచ్చాయి. ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఏకపక్షంగా తమకు ఈ ఇన్‌చార్జి వీసీ వద్దంటూ నెలక్రితం కూడా ఆందోళనలు చేపట్టారు. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి విన్నవించారు. వీటన్నింటి నేపథ్యంలో వెంకటరమణను తప్పించినట్లు తెలుస్తోంది.

Published date : 19 Oct 2024 09:53AM

Photo Stories