Vaccination: జిల్లాల వారీగా టీకా తీసుకున్న వారు సంఖ్య..
ఉదయం పది గంటల నుంచి టీకా వేసే ప్రక్రియ ప్రారంభించగా అది రాత్రి వరకు కొనసాగింది. తొలిరోజు రాష్ట్రంలోని 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్లలో 4,92,613 మందికి కోవాగ్జిన్ టీకా వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,719 మందికి చేశారు. కొన్నిచోట్ల ఆరోగ్య సిబ్బంది పాఠశాలలకు వెళ్లి వేశారు. కోవిన్ యాప్‌లో పేరు రిజిస్టర్ చేసుకున్న వారికి నేరుగా టీకా ఇవ్వగా.. మిగిలిన వారికి ఆధార్ కార్డు, పాఠశాల గుర్తింపు కార్డులోని వివరాలు నమోదు చేసి టీకా వేశారు. ఇక 7వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. 25 లక్షల మంది యువత లక్ష్యం కాగా 40 లక్షల కోవాగ్జిన్ డోసులను సిద్ధంగా ఉంచారు.
టీకా తీసుకున్న వారు..
జిల్లా |
సంఖ్య |
చిత్తూరు |
72,719 |
శ్రీకాకుళం |
38,644 |
నెల్లూరు |
39,759 |
కృష్ణా |
51,778 |
పశ్చిమ గోదావరి |
39,193 |
విజయనగరం |
23,573 |
తూర్పు గోదావరి |
46,210 |
వైఎస్సార్ కడప |
28,897 |
అనంతపురం |
35,364 |
కర్నూలు |
38,942 |
ప్రకాశం |
25,036 |
గుంటూరు |
29,004 |
విశాఖపట్నం |
23,494 |
చదవండి:
New Rules: ఇకపై జాబ్ కావాలంటే.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉండాల్సిందే..!
Covid-19 Vaccination: కరోనా టీకా పంపిణీలో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న రెండో దేశం?
Covid-19 Vaccination: ఎక్కువమందికి టీకా వేసిన రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?