Covid-19 Vaccination: కరోనా టీకా పంపిణీలో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న రెండో దేశం?
కరోనా మహమ్మారిపై పోరాటంలో భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేసి ఘన కీర్తి సాధించింది. కరోనాపై పోరాటంలో రక్షణ కవచమైన భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 2021, జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఆరోగ్య, వైద్య సిబ్బందికి టీకా డోసులు ఇచ్చి.. విడతల వారీగా, ప్రణాళికతో ఒక్కో వయసు వారికి ఇస్తూ ముందుకు వెళ్లింది. 2021, అక్టోబర్ 21 నాటికి వంద టీకా డోసుల్ని పూర్తి చేసి.. చైనా తర్వాత 100 కోట్ల డోసుల్ని పంపిణీ చేసిన రెండో దేశంగా ప్రపంచ దేశాల ప్రశంసల్ని అందుకుంది.
ప్రత్యేక గీతం విడుదల
వంద కోట్ల డోసుల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. గాయకుడు కైలాష్ ఖేర్ ఆలపించిన ఈ గీతం ఆడియో విజువల్ ఫిల్మ్‌ని ఎర్రకోట వద్ద విడుదల చేశారు.
మువ్వన్నెల వెలుగులు
శత కోటి టీకా డోసులు అరుదైన చరిత్రను సాధించినందుకుగాను ఢిల్లీలోని కుతుబ్‌మినార్ నుంచి హైదరాబాద్లోని గోల్కొండ కోట వరకు 100 వారసత్వ కట్టడాలను త్రివర్ణ శోభతో కాంతులు ప్రసరించేలా కేంద్ర పురావస్తు శాఖ చర్యలు తీసుకుంది. ఇక 1,400 కేజీల బరువైన ఖాదీ జాతీయ పతాకాన్ని ఎర్రకోట వద్ద ఆవిష్కరించారు.
చదవండి: ఇటీవల ప్రారంభమైన కుషీనగర్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ టీకా పంపిణీలో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న రెండో దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : భారత్
ఎక్కడ : ప్రపంచంలో...
ఎందుకు : కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...