Skip to main content

Buddhist Circuit: ఇటీవల ప్రారంభమైన కుషీనగర్‌ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?

Kushinagar Airport

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కుషీనగర్‌ జిల్లా కుషినగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. అక్టోబర్‌ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనతరం పలు ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుషీనగర్‌లో నిర్వహించిన అభిదమ్మ దినోత్సవం(అక్టోబర్‌ 20)లో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బుద్ధిస్టు టూరిజం సర్క్యూట్‌కు మరింత ఊతం ఇవ్వడంలో భాగంగా కుషీనగర్‌ విమానాశ్రయాన్ని నిర్మించారు.

స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద... 

దేశంలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందించింది. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్‌ రాష్ట్రాలలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధి కోసం రూ.325.53 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర పర్యాటక శాఖ అక్టోబర్‌ 5న తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న పర్యాటక రంగ అభివృద్ధి, పురోగతిలో కీలక పాత్ర పోషించే విదేశీ, దేశీయ పర్యాటకంలో బౌద్ధ పర్యాటకం ఒకటిగా కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా బుద్ధ సర్క్యూట్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2021, నవంబర్‌ 17 నుంచి 21 వరకు అంతర్జాతీయ బౌద్ధ సమావేశాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ ప్రణాళికలను ఇప్పటికే అమలుచేస్తోంది.
 

చ‌ద‌వండి: విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ పదవికి ఎవరు అర్హులు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కుషినగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
ఎప్పుడు   : అక్టోబర్‌ 20
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : కుషీనగర్, కుషీనగర్‌ జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : బుద్ధిస్టు టూరిజం సర్క్యూట్‌కు మరింత ఊతం ఇవ్వడంలో భాగంగా...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Oct 2021 12:33PM

Photo Stories