Scholarship: ఉపకార దరఖాస్తుకు మరో అవకాశం
Sakshi Education
- ఈనెల 21 వరకు ఈపాస్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కలి్పంచింది. 2021–22కి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసినప్పటికీ.. వైద్య విద్యతో పాటు పలు కోర్సుల్లో అడ్మిషన్లు పూర్తికాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈనెల 21 వరకు దరఖాస్తు చేసుకునే వీలు కలి్పంచింది. ఫ్రెష్ విద్యార్థులతో పాటు రెన్యువల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోని వారు నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖసూచించింది.
Also read: Inter Exams: చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక
Published date : 12 May 2022 03:43PM